కెసిఆర్ ఎమ్మెల్యే గా అనర్హుడు ...

SMTV Desk 2019-01-25 18:15:26  Cm Kcr, Unfitfor MLA, High court, petition, Telangana elections, Affidafit

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణాలో 2018 ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అఫిడవిట్ లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని శ్రీనివాస్ అనే వ్యక్తి తన పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసారు. ఈయన కెసిఆర్ సొంత నియోజకవర్గానికి చెందిన వొక ఓటరు కావడం కొసమెరుపు. కేసీఆర్ పై ఇప్పటివరకు మొత్తం 64 క్రిమినల్ కేసులు ఉన్నాయని అయితే మొదటి అఫిడవిట్ లో 2 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపారని తెలిపారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు కేసీఆర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. వచ్చే సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది.