పవన్ ని మెచ్చిన బాబు

SMTV Desk 2017-07-31 14:11:55  Pawan kalyan, janasena, AP CM, chandrababu naidu, AP CM about pawan greatness

అమరావతి,జూలై 31: జనసేన అధినేత ఒక అడుగుతో ప్రారంభించిన ఉద్దానం సమస్యపై పోరాటంలో భాగంగా నేడు ఏపీ సీఎంతో పవన్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నేడు పవన్ తో పాటు హార్వర్డ్ యూనివర్శిటీ వైద్య బృందంతో ఏపీ సచివాలయంలో సమావేశమైన చంద్రబాబు, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరికీ ఈ వ్యాధులు రాకుండా చేసేందుకు తక్షణం ఏ విధమైన చర్యలు తీసుకోవడానికైనా మా ప్రభుత్వం సిద్దమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి ఆ ప్రాంతంలో రక్షిత మంచినీటిని మాత్రమే తాగేలా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ సమస్యకు కారణాలను కనుగొనలేక పోయిందని, దీనిపై ముందుకు కదిలిన పవన్ కల్యాణ్ అభినందనీయుడని బాబు కొనియాడారు.