రెండో విడతలోను కారు జోరే ....!!!

SMTV Desk 2019-01-25 17:31:00  Trs, Panchayath elections, second phase, Congress, Bjp, Tdp,

హైదరాబాద్‌, జనవరి 25 : తెలంగాణ లో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి మొదలుకాగానే తెరాస జోరు చూపిస్తోంది. 3 వేల 341 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకెళ్తున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మొదటి విడతలో మాదిరిగానే కారు స్పీడును కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులతో సహ ఏ పార్టీ అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1220 మంది టీఆర్ఎస్ మద్దతుదారులు, 240 మంది కాంగ్రెస్ మద్దతుదారులు,టీడీపీ 16, బీజేపీ 9 ఇతరులు 234 స్థానాల్లో గెలుపొందారు. మరో కొద్ధి గంటల్లో పూర్తి స్థాయి ఫలితాల వివరాలు రానున్నాయి.