ఫొటోగ్రాఫర్‌కి ​​ ​​చేయి అందించిన రాహుల్‌

SMTV Desk 2019-01-25 16:31:16  Rahul gandhi, AICC chief, Bhuvaneswar, Photographer, Congress chief

భువనేశ్వర్‌, జనవరి 25: కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ రాహుల్‌ గాంధీ వొక ఫొటోగ్రాఫర్‌ కింద పడిపోవడంతో వెంటనే అతన్ని కాపాడేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వొడిశా కి రాహుల్‌ చేరుకున్నారు. భువనేశ్వర్‌ విమానాశ్రయం వద్ద ఆయన‌ నడిచి వెళుతుండగా స్థానిక ఫొటోగ్రాఫర్‌ ఆయన ఫొటోలు తీసేందుకు యత్నించారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్‌ అదుపుతప్పి గట్టుమీద నుంచి కాలు జారి కింద పడిపోయారు. దీనిని గమనించిన రాహుల్‌ వెంటనే ఆ ఫొటోగ్రాఫర్‌ వద్దకు వెళ్లి చేయి అందించి పైకి లేపారు. ఫొటోగ్రాఫర్‌ నడుము, తల భాగానికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో ఈ చిత్రాన్ని అక్కడ వున్న మీడియా వర్గాలు వీడియో తీశాయి. దాంతో ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.