టాప్‌ ట్రెండింగ్‌లో ప్రియాంకా ??

SMTV Desk 2019-01-25 15:16:31  Priyanka Gandhi, Twitter Trending, Congress, Sonia Gandhi, Rahul Gandhi, 2019 elections

న్యూ ఢిల్లీ, జనవరి 25: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కుమార్తె, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా ఆమె నియమితులైన నేపథ్యంలో సామజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఆమెకు సంబంధించిన విషయాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం ప్రపంచంలోనే టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. బుధవారం మధ్యాహ్నం #PriyankaGandhi వరల్డ్‌వైడ్‌ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. అలాగే, AICC General, Priyanka Vadra, Cogress General అనే హ్యాష్‌ట్యాగ్‌లు వరసగా 14, 15, 18వ స్థానాల్లో ఉన్నాయి.