చరణ్ భార్యకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్..

SMTV Desk 2019-01-25 13:46:46  KTR, ram charan, upasana, tweet, invest telangana

హైదరాబాద్, జనవరి 25: ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్ కు సమన్వయకర్తగా ఉన్నందుకు రామ్ చరణ్ భార్య ఉపాసనకు సిరిసిల్ల ఎమ్మెల్యే, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్ కు సమన్వయకర్తగా ఉన్న ఉపాసనకు కేటీఆర్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

నిన్న దావోస్ లో తెలంగాణ స్టాల్ రిసెప్షన్ లో కూర్చుని తాను దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ, "కేటీఆర్ సర్... నేను కొత్త ఉద్యోగంలో చేరారను, నా జాబ్ ఎలా ఉంది" అని ఉపాసన ట్వీట్ చేసారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. "మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు" అంటూ ఆమెకు రిప్లయ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.