ఈరోజే మెగా హీరోయిన్ టీజర్..

SMTV Desk 2019-01-25 11:39:08  niharika, suryakantham movie, teaser, rahul vijay

హైదరాబాద్, జనవరి 25: మెగా వారసురాలిగా నిహారిక వొక మనసు చిత్రంతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైంది. ఆ సినిమా ఆమెకు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత కూడా ఆమె నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వచ్చింది, కానీ అవికూడా ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రధారిగా సూర్యకాంతం చిత్రం నిర్మితమవుతోంది. ప్రణీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో నిహారిక వుంది.