ఫాన్స్ కు రవితేజ పుట్టినరోజు కానుక..

SMTV Desk 2019-01-24 16:08:26  raviteja, birthday, VI anand, santosh srinivas, payal rajput, movie news

హైదరాబాద్, జనవరి 24: మాస్ మహారాజా రవితేజకి రాజా ది గ్రేట్ సినిమా తరువాత హిట్ లేదు. దీంతో ఆయన ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి చిత్రాన్ని వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేయడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగుతుందని సమాచారం. గత నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కథా కథనాలు మరింత పట్టుగా వచ్చేలా రవితేజ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో ఆలస్యమైంది.

అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ నెల 26వ తేదీన రవితేజ పుట్టినరోజును పురస్కరించుకొని టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కథానాయికలుగా నాభా నటేష్ .. పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను రవితేజ వొక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడనుందని సమాచారం.