విఫలమైన ఈసీ ..???

SMTV Desk 2019-01-24 15:38:09  Election commission, Telangana state,Congress,Tjs,Tdp,Uttam kumar,Kodandaram,Ramana,Darna

హైదరాబాద్‌, జనవరి 24: కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తెలంగాణ టిడిపి అధ్యక్షడు ఎల్‌.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాంతో పాటు కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఎక్కడా వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించలేదని ఆరోపించారు. ఈవీఎంలపై అనుమానం వచ్చి ఓట్ల లెక్కింపు రోజే తమ అభ్యర్థులందరికీ మెసేజ్‌లు పంపామని చెప్పారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరించకుండా ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ఎన్నికల సంఘాన్ని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఈసీ విఫలమైందని ఉత్తమ్‌ ఆరోపించారు.