నయనతార కోసం పట్టుబట్టిన మెగా హీరో..

SMTV Desk 2019-01-24 13:50:27  Chiranjeevi, Nayanatara, saira narasimha reddy, ram charan, surendar reddy

హైదరాబాద్, జనవరి 24: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా నిర్మితమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తుంది. ప్రస్తుతం తమిళనాట నయనతార స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె చేసిన కొన్ని విభిన్నమైన చిత్రాలు .. అవి సాధించిన విజయాలు నయనతార స్థానాన్ని మరింత పదిలం చేశాయి. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు సినిమాలు వొప్పుకోవడం గగనం అయిపోయింది. అలాంటిది మెగా ప్రాజెక్ట్ కావడంతో ఆమె సైరా చేయడానికి అంగీకరించింది. అయితే ఇటీవల కాలంలో ఆమె సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం మానేసింది. అనామిక సినిమా తరువాత ఆమె పూర్తిగా ప్రమోషన్స్ లో పాల్గొనడమే మానేసింది.

కాగా కొన్ని కారణాల వలన ఆమె ఆ నిర్ణయం తీసుకుందట. అయితే నయనతార సైరా ప్రమోషన్స్ లో పాల్గొన వలసిందేనని చరణ్ పట్టుబట్టాడట. ఈ నేపథ్యంలో నయనతారతో ఆయన నేరుగా మాట్లాడి .. ప్రమోషన్స్ కి ఆమె వస్తే బాగుంటుందనే తన అభిప్రాయాన్ని వక్తం చేశాడట. దాంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, ఈ సినిమా ప్రమోషన్స్ కి వస్తానని నయనతార చెప్పిందట. ఇక సైరా సినిమా ప్రమోషన్స్ లో నయనతార కనిపించనుందన్న మాట.