కాంగ్రెస్ పార్టీ అణు అస్త్రం...

SMTV Desk 2019-01-24 13:29:26  Priyanka gandhi, Rahul gandhi, Sonia Gandhi, AICC, Congress party,Bjp, Sp,Bsp, AICC secretary

జనవరి 24: నెహ్రూ-గాంధీ కుటుంబం నుండి మరో వ్యక్తి భారత రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 11వ వ్యక్తిగా ఇందిరాగాంధీ మనవరాలు, రాజీవ్‌గాంధీ కుమార్తె అయిన ప్రియాంకాగాంధీ ఇప్పుడు నేరుగా క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాహుల్‌గాంధీ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించిన మరో వ్యక్తి ప్రియాంక. ఈమెను కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శిగా ఏఐసీసీ బుధవారం నియమించింది. మొట్టమొదటి సారి కాంగ్రెస్‌పార్టీలో అధికారికంగా ప్రియాంక రాజకీయపరమైన పదవిని పొందింది. ఇదివరకు తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌ గాంధీలు నిర్వహించిన ఎన్నో బహిరంగసభల్లో పాల్గొన్నారు. కాని అధికారికంగా పార్టీ బాధ్యతలను చేపట్టడం ఇదే మొదటిసారి. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుండే బ్రిటిష్ పాలకులతో పోరులో మోతీలాల్‌నెహ్రూ పాల్గొన్నారు. తొలుత 1919-1920....ఆ తర్వాత 1928-29 సంవత్సరాల్లో మోతీలాల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు మునుపే నెహ్రూ గాంధీ కుటుంబం, సభ్యులు కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యంగా ఉన్నారు. మోతీలాల్‌ కుమారుడు అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ 1912లో భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

1923లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానకార్యదర్శిగా కాంగ్రెస్‌పార్టీ పగ్గాలు అందుకున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో పలు భాద్యతలు నిర్వర్తించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పోరాట యోధులుగా ఎదిగారు. 1947లో స్వాతంత్య్రం రాగానే భారతదేశ తొలిప్రధానిగా భాద్యతలు స్వీకరించారు. జవహర్‌లాల్‌ కుమార్తె ఇందిర గాంధి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈమె కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా 1958లో నియమింపబడ్డారు. 1964లో తండ్రి జవహర్‌లాల్‌ నెహ్రూ మరణానంతరం కూడా ఆమె రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఆ తర్వాత 1966లో భారత తొలి మహిళా ప్రధాని అయ్యారు. ఎమర్జెన్సీ విధింపుతో విమర్శలకు దారితీసింది. 1977లో ఓటమి పాలైనప్పటికీ.... తిరిగి 1980లో భారత ప్రధాని పదవిని అధిష్టించారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉండగానే ఆమె 1984లో హత్యకు గురయ్యారు. ఇందిర అధికారంలో ఉండగా వొక్కవెలుగువెలిగి...కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు చేపడతారనుకున్న ఆమె కుమారుడు 1980లో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాడు. తదనంతరం ఇందిరాగాంధీరెండో కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1989లో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. అ తర్వాత అనగా 1991లో రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.

రాజీవ్ గాంధీ మరణాంతరం ఆయన భార్య సోనియా గాంధి 1997 లో ఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాల వాళ్ళ 1998 లో కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్ష పదవిని చేపట్టారు. రాజీవ్ సోనియా ల కుమారుడు అయిన రాహుల్ గాంధి 2018 డిసెంబర్ లో ఏఐ సి సి అధ్యక్షుడిగా పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించారు. తాజాగా నెహ్రు కుటుంబం నుండి ప్రియాంక గాంధీ ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో కి అడుగుపెట్టారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వారసురాలుగా ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలాకాలం నుంచి పార్టీలో డిమాండ్లు వస్తున్నాయి. దీని లో బాగంగా తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‌ను పార్టీ పరంగా రెండుగా (తూర్పు, పశ్చిమ) విభజించి, ఇద్దరు ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. యూపీలో ఇప్పటివరకూ నలుగురు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులతో ప్రయోగాలు చేసారు. ఇప్పుడు రెండుగా విబజించిన యూపీ కాంగ్రెస్ పార్టీ విభాగాల్లో బాగంగా వొక దానిని ప్రియాంకకు, ఇంకో దానిని గ్వాలియర్‌ కి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు. లఖ్‌నవూ పైభాగం అంతా తూర్పు ప్రాంతం, దిగువ భాగమంతా పశ్చిమ భాగం కిందికి రానుంది. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియాలు చెరో 40 లోక్‌సభ స్థానాల బాధ్యతలను చూసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.





దేశంలోనే కీలకంగా మారిన యూపీలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన పట్టుని సాధించేందుకు లక్ష్యంగా కీలక మార్పులు జరిగినట్టు తెలుస్తుంది. తల్లి సోనియాగాంధీ క్రమక్రమంగ అన్ని బాధ్యతల నుంచి జరుగుతూ వస్తున్నందున వచ్చే ఎన్నికల్లో రాయబరేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీయే పోటీకి దిగే అవకాశాలు చాలానే వున్నాయి. కాంగ్రెస్‌కు ఇప్పటివరకు యూపీలో భలమైన నాయకత్వం లేదు. ఇపుడు ప్రియాంక గాంధీ రాకతో ఆ లోటు తీరిపోయేలా వుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు పట్టున్న గోరఖ్‌పూర్‌ ,దీనితో పాటు అలహాబాద్ కూడా ప్రియాంక చేపట్టబోయే స్థానాల పరిదిలో వున్నాయి. ఇక భాజపా నాయకులని, వారి వ్యూహాలు మరియు ఎత్తుగడలని ఎదుర్కునేందుకు తన ఆస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక ని భరిలో దింపింది. రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఉహించని విధంగా ప్రియాంక కి భాద్యతలను అప్పగించి సంచలనానికి తేరా లేపింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈమెకి ఉత్తర్‌ప్రదేశ్‌ పరిదిలో కీలక భాద్యతలని అప్పగించారు. బిజేపీ లో మోడీ అమిత్ షా ధ్వయంని ఎదుర్కోడానికి రాహుల్‌, ప్రియాంకలు గట్టి పోటి ఇవ్వడానికి సిద్దపడినట్లు తెలుస్తుంది. మాటలే కాకుండా చేతల్లో చేసే నాయకుల కోసం ప్రజలు చూస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లో ఇపుడు వారి మాటకి ,చేతలకి విలువ పెరిగే అవకాశం వుంటుంది అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఏ ఐ సి సి చీఫ్ రాహుల్‌ గాంధీ అమెరికా వెళ్లి మరీ తన చెల్లిని వొప్పింఛి వచినట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. దాదాపు రెండేళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాలని ప్రియాంక అనుకుంటున్నారు. తన రాజకీయ ప్రవేశం గురించి గతవారమే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ, అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పారీ పొత్తు కుదుర్చుకొని కాంగ్రెస్‌ను దూరం పెట్టేయడంతో, ప్రియాంక రాజకీయ ప్రవేశానికి ఇదే మంచి తరుణమని రాహుల్‌ భావించారు. గతవారం ఆయన దుబాయ్‌ నుంచి నేరుగా న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ చెల్లితో మాట్లాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేలా ఆమెను వొప్పింఛి ప్రస్తుతం పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రియాంక భారత్‌కు తిరిగి రానుంది. ఎస్పీ, బీఎస్పీలతో కాంగ్రెస్‌ పొత్తు వొకవేళ కుదిరి ఉంటే ప్రియాంక రాజకీయ ప్రవేశం వేరే సమయంలో, మరోలా ఉండేదని కాంగ్రెస్‌ కీలక నేత వొకరు అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో తాము సాధించబోయే స్థానాలు 10 లోపే ఉంటాయని తొలుత భావించినట్లు కాంగ్రెస్‌ అంతర్గత వర్గాలు తెలిపాయి.


ప్రియాంక రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశముందని పేర్కొన్నాయి. తాము రాష్ట్రంలో మొత్తం 80 స్థానాల్లోనూ పోటీ చేసి కనీసం 30 సీట్లు గెల్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం చోటు చేసుకున్న పరినామలతో సోషల్ మీడియా పరంగా ప్రియాంక గాంధి ట్రెండ్ సెట్టర్ గా కనపడుతుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా లో మోదిపైన వున్నఆసక్తి అంత ఇపుడు ప్రియాంక దిశగా మారే అవకాశం వుందని కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ మోదీపైనే కేంద్రీకృతమైన మీడియా దృష్టిని ప్రియాంక తన వైపునకు తిప్పుకొనే అవకాశం ఉన్నందున ఆ ప్రభావం కాంగ్రెస్‌కు చాలా ఉపయోగపడుతుందన్న విశ్లేషణ ఉంది. యువత ఎక్కువగా ఉపయోగించే సామాజిక మాధ్యమానికి ఇకమీదట ప్రియాంక కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉన్నందున మోదీ ప్రభ మసకబారడం ఖాయమని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొంటున్నారు. దక్షిణాదిలోనూ ప్రియాంక ప్రభావం బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రియాంక రాకతో కాంగ్రెస్ పార్టీకి ఉత్తర్‌ప్రదేశ్‌, దేశ రాజకీయలలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేసారు.