మరో ఐదేళ్లు ఈ సినిమాలే చేస్తా :అఖిల్

SMTV Desk 2019-01-24 13:28:13  Akhil, Mr.Majnu, nidi agarwal, venky atluri

హైదరాబాద్, జనవరి 24: అక్కినేని వారసుడు అఖిల్ కధానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను చిత్రం రూపొందింది. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైంది. అయితే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లో బిజీగా వుంది. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ .."ఇంతకుముందు నేను చేసిన అఖిల్ .. హలో సినిమాల సంగతి పక్కన పెడితే, మిస్టర్ మజ్ను చిత్రం నాకు సరైనది. గత చిత్రాల అనుభవం తరువాత నాకు నేనుగా ఆత్మ విమర్శ చేసుకున్నాను ..అందులో నుంచి వచ్చినదే ఈ సినిమా.

ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. యాక్షన్ .. ఇలా ప్రతి విషయంలో కొత్తదనం కనిపిస్తుంది. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే కొత్తదనం ఈ సినిమాలో తప్పకుండా కనిపిస్తుంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకం నాకు వుంది. నా వయసుకు లవ్ స్టోరీస్ చేయడమే కరెక్ట్. అందువలన వొక అయిదేళ్ల పాటు లవ్ స్టోరీస్ చేయాలనే నిర్ణయించుకున్నాను. ఇక నా తదుపరి సినిమా ఏమిటనేది త్వరలో చెబుతాను. మార్చిలో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చు" అని చెప్పుకొచ్చాడు.