ఏఎన్నార్ పై ఎన్టీఆర్ ఎఫెక్ట్..

SMTV Desk 2019-01-24 12:46:26  Nagarjuna, ANR Biopic, NTR biopic, Sumanth, akhil, Mr.Majnu

హైదరాబాద్, జనవరి 24: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను రేపు భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ తో పాటు నాగార్జున కూడా బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా నాగ్ మాట్లాడుతూ, ఏఎన్నార్ బయోపిక్ గురించి స్పందించారు."నాన్నగారు నటించిన సినిమాలు రీమేక్ చేయడానికే మేము భయపడుతుంటాము. ఇక ఆయన బయోపిక్ ను తీసే సాహసం ఎలా చేయగలం అన్నారు. అక్కినేనికి ఘన నివాళిగా అందించే బయోపిక్ పరాజయం పాలైతే మేము తట్టుకోలేమన్నారు .

అయితే ఏఎన్నార్ బయోపిక్ తీసే ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదనే విషయాన్ని నాగ్ స్పష్టం చేశారు. మొదట ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి రాగానే అక్కినేని బయోపిక్ ను ప్రస్తావించగా నాగార్జున అప్పుడు వద్దనుకున్నారు. ఎన్టీఆర్ కధానాయకుడు రిలీజ్ అయిన తరువాత అందులో ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ ని చూసి తన కుటుంబ సభ్యులతో చర్చించి .. మనసు మార్చుకున్నారంటూ జరిగిన ప్రచారానికి ఆ విధంగా ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అందువల్లనే నాగార్జున తన తండ్రి బయోపిక్ గురించిన ఆలోచన మనుకున్నారని సమాచారం.