లేడీ ఓరియంటెడ్ చేయనున్న అనిల్ రావిపూడి..

SMTV Desk 2019-01-24 12:20:44  Anil ravipudi, S S Rajamouli, Trivikram Srinivas, Koratala siva, F2 Movie, lady oriented movie

హైదరాబాద్, జనవరి 24: ఎఫ్2 చిత్రం భారీ విజయం నమోదు చేసుకోవడంతో అనిల్ రావిపూడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో టాప్ దర్శకులుగా కొనసాగుతున్న రాజమౌళి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ .. కొరటాల శివ తరువాత స్థానంలో ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది. తన కెరియర్ ను ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రతిసారి భిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయన చేసే ప్రతి సినిమాలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తాడు. అనిల్ రావిపూడి కొత్తదనానికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా వుంటుందనేది ఇటీవల వచ్చిన ఎఫ్ 2 చిత్రం నిరూపించింది.

ఇక ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఎఫ్ 2 సీక్వెల్ రానుందనీ .. అనంతరం బాలకృష్ణతో ఓ సినిమా వుంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాల కంటే ముందుగా ఆయన మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను పలకరించే అవకాశాలు వున్నాయని సమాచారం. ప్రస్తుతం ఆయన వొక లేడీ ఓరియంటెడ్ సినిమాకి సంబంధించిన కథపై కసరత్తు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ ఆయన చేసిన చిత్రాలకి ఇది పూర్తి డిఫరెంట్ గా ఉండనుందని సమాచారం.