'ఆర్.ఆర్.ఆర్' మూవీలో కీలక పాత్రలో తమిళ దర్శకుడు..

SMTV Desk 2019-01-24 11:22:29  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie, DVV Dnayya, Samudrakani

హైదరాబాద్, జనవరి 24: దర్శకదిగ్గజం రాజమౌళి.. జూ.ఎన్టీఆర్ ..రామ్ చరణ్ లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు ఇంతవరకూ బయటికి రాలేదు. అయితే ఈ చిత్రంలో వొక కీలక పాత్ర కోసం తమిళ నటుడు .. దర్శకుడు సముద్రఖనిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. చాలా ప్రాధాన్యత కలిగిన వొక ముఖ్యమైన పాత్ర కోసం ఆయనను తీసుకున్నారట. కాగా ఈ వార్త నిజమేననేది తాజా సమాచారం.

ఇక ఆయన పాత్ర ఏమిటనే విషయమే తెలియాల్సి వుంది. సముద్రఖనికి సహజ నటుడిగా, దర్శకుడిగా తమిళనాట మంచి పేరు వుంది. ఆయన రఘువరన్ బీటెక్ లో చేసిన ధనుశ్ తండ్రి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించగా, హీరోయిన్లగా పలువురు పేర్లు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.