రికార్డు సృష్టించిన ట్రంప్..

SMTV Desk 2019-01-23 19:16:45  Donald trump, fake news, new record, Washington Post, false statements

వాషింగ్టన్‌, జనవరి 23: డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 8,158 సార్లు తప్పుడు ప్రకటనలు చేశారని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్‌ ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ‘ఫ్యాక్ట్‌ చెకర్స్‌ డేటాబేస్‌ అనే కంపెనీ ట్రంప్‌ చేసిన ప్రతీ తప్పుడు సమాచారాన్ని విశ్లేషించింది. మొదటి సంవత్సరంలో రోజుకు సరాసరి 5.9 తప్పుడు ప్రకటనలు చేశారని, రెండో ఏడాదికి వచ్చే సరికి ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగి, రోజుకు 16.5 తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని పేర్కొంది.

అయితే ట్రంప్ చేసిన మొత్తం 8,158 తప్పుడు ప్రకటనల్లో దాదాపు 6 వేలకు పైగా ప్రకటనలు రెండో ఏడాదే చేసినవే అని తెలిపింది. ఆయన అధ్యక్షుడైన 100 రోజుల్లోనే 492 తప్పుడు ప్రకటనలు చేశారని తెలిపింది. ట్రంప్ ఇప్పటి వరకు చేసిన తప్పుడు ప్రకటనల్లో అధికంగా వలసల గురించే చేయడం గమనార్హం. విదేశీ విధానం గురించి 900, వాణిజ్యం గురించి 854, ఆర్థిక వ్యవస్థ గురించి 790, ఉద్యోగాల గురించి 755 తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ రెండేళ్లలో 82 రోజులు మాత్రమే ఎటువంటి తప్పుడు ప్రకటనలు చేయలేదని వెల్లడించింది.