మరోసారి పెళ్ళి పీటలెక్కుతున్న సూపర్ స్టార్ కూతురు..

SMTV Desk 2019-01-23 17:28:45  Rajanikanth, sowndarya, 2nd marriage

హైదరాబాద్, జనవరి 23: సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం 2010లో అశ్విన్ అనే వ్యాపార వేత్తతో జరిగింది. వారికీ వొక కుమారుడు కలిగాక ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2017వ సంవత్సరంలో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే గత ఏడాది విషగన్ వనగమూడితో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో సౌందర్యకి నిశ్చితార్థం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలోని వొక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరగనుంది. మెహెందీ .. సంగీత్ కార్యక్రమాలను కలుపుకుని, ఇది మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుక అని తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టు సమాచారం. ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్ సౌందర్యకి సన్నిహితుడని సమాచారం. ఆయన కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించాడు.