ఏ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదు....

SMTV Desk 2019-01-23 17:19:14  TDP, Congress party, Andhrapradesh assembly elections, oommen chandy

విజయవాడ, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలేగుదేశం పార్టీతో గాని, వేరే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదు అని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో సమావేశమైన ఉమెన్ చందీ పొత్తుల వ్యవహారంపై మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని,త తాము వొంటరిగానే పోటీ చేస్తామని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఊమెన్ చాందీ పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యూహంపై ఈ నెల 31వ తేదీన సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో బస్సు యాత్ర చేస్తామని, 13 జిల్లాల్లో బస్సు యాత్రా సాగుతుందని ఆయన చెప్పారు.

పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెలాఖరు లోగా ఎన్నికల కమిటీ వేస్తామని, దీనిపై అధిష్టానానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసససభా స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఎపికి న్యాయం జరుగుతుందని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. రాహుల్ ప్రధాని అయితే విభజన హామీలు అమలవుతాయని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వచ్చే నెల 1వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు రఘువీరా తెలిపారు. ప్రియాంక ఎంట్రీతో మరోసారి ఇందిరమ్మ గాలులు వీస్తాయని ఆయన అన్నారు.