కరెంట్ బిల్లుతో షాక్‌..!

SMTV Desk 2019-01-23 16:21:24  Uttar Pradesh, Kannauj, Power bill, UP Electricity deportment

లక్నో, జనవరి 23: మాములుగా ఎవరికైనా కరెంట్‌ తీగ పట్టుకుంటే షాక్‌ కొట్టిద్ది, కానీ కరెంట్‌ బిల్లు చూసి షాక్‌కు గురయ్యాడు వొక వ్యక్తి. ఇంటి అవసరాల నిమిత్తం వాడిన కరెంట్‌కి ఏకంగా రూ.23.6 కోట్లు బిల్లు వేశారు విద్యుత్‌ అధికారులు. ఉత్తర ప్రదేశ్ లోని కనౌజ్‌కు చెందిన అబ్దుల్‌ బసిత్‌ గృహ అవసరాల నిమిత్తం నెలకు 2 కిలోవాట్ల కరెంట్‌ను వినియోగించుకున్నాడు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు అతనికి రూ. 23,67,71,524 బిల్లు వేశారు. ఇంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లు చూడగానే అబ్దుల్‌కు నిజంగానే షాక్‌ కొట్టింది. వెంటనే అధికారుల వద్దకు పరిగెత్తి పరిస్థితి వివరించాడు.

ఇక దీనిపై అబ్దుల్‌​ మాట్లాడుతూ.. ‘బిల్లు చూడగానే షాక్‌ అయ్యాను. ఇది నా వొక్కని బిల్లా.. లేకా రాష్ట్రం మొత్తం బిల్లా అనే విషయం అర్థం కాలేదు. జీవితాంతం సంపాదించినా కూడా ఇంత బిల్లు నేను కట్టలేను అంటూ వాపోయాడు. అయితే మీటర్‌ రీడింగ్‌లో జరిగిన పొరపాట్ల వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయని అధికారులు వెల్లడించారు. ఈ తప్పును సరిదిద్దుతాము... ఆ తర్వాతే బిల్లు కడితే సరిపోతుంద ని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు