టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై బాబు ఫైర్

SMTV Desk 2019-01-23 15:57:30  TG Venkatesh, MP, Janasena party, Pawan kalyan, Chandrababu, TDP

అమరావతి, జనవరి 23: టీడీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీజీ వెంకటేష్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా ఉండాల్సిందంటూ మండిపడ్డారు. పార్టీ విధాన పరమైన నిర్ణయాలను వ్యక్తిగత నిర్ణయాలుగా ప్రకటించొద్దంటూ హెచ్చరించారు. టీజీ వెంకటేష్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతారని చంద్రబాబు వాపోయారు.

గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త స్తబ్ధుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీపై విమర్శల దాడిని కాస్త తగ్గించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ లో పవన్ ను కలిసిరావాలంటూ అడిగే అవకాశాలుంటున్న నేపథ్యంలో ముందుగానే టీజీ వెంకటేష్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.