పవన్ అభిమానుల్లో ఆగ్రహం

SMTV Desk 2017-07-31 12:23:26  Pawan kalyan, janasena, AP CM, chandrababu naidu, uddanam

విజయవాడ, జూలై 31: నేడు పవన్ కల్యాణ్ విజయవాడకు వచ్చి సీఎం చంద్రబాబునాయుడితో ఉద్దానం సమస్యపై సమావేశం కానున్నారని తెలిసిందే. అయితే ఆయనకు స్వాగతం పలుకుతూ, అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించి వేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. భవానీపురం శివాలయం సెంటర్ లో మూడు రోజుల క్రితం ప్లెక్సీలను ఏర్పాటు చేయగా, వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానిక తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడి సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ని వారు పరిశీలిస్తున్నారు. ప్లెక్సీలను చించేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.కాగా పవన్ తో పాటు డాక్టర్స్ బృందం సీఎం చంద్రబాబునాయుతో భేటీలో పాల్గొన్నారు. ఉద్దానం సమస్యపై ఈ భేటీ అనంతరం ఒక పరిష్కారాన్ని తెలుపనున్నారు. అక్కడ ఏలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై డాక్టర్స్ బృందం సీఎంకు వివరించనుంది.