'గబ్బర్' ఫాస్టెస్ట్ రికార్డ్...

SMTV Desk 2019-01-23 13:03:37  Shikar dhawan, Gabbar, Team India, Newzeland, World record, Fastest runs in ODI, Indian batsmen, Cricket

న్యూ ఢిల్లీ, జనవరి 23: టీం ఇండియాలో సెహ్వాగ్, గంభీర్ జోడి, ఓపెనింగ్ భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన విషయం తెలిసిందే. తరువాత ఈ జోడిని రీప్లేస్ చెయ్యడానికి అనేక విధాలుగా ప్రయత్నించి ఆఖరికి శిఖర్ ధావన్, రోహిత్ శర్మ లే టీం ఇండియా విజయాల్లో మంచి ఓపెనింగ్ జోడీ గా పేరు తెచ్చుకున్నారు. ఇక విషయానికొస్తే టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డేలలో 117 ఇన్నింగ్స్ లలో 5000 పరుగులు సాధించిన రెండవ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. నేడు న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే నేపియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ ఈ రికార్డును సాధించాడు.

అయితే ప్రపంచవ్యాప్తంగా హషీం ఆమ్లా ( దక్షిణాఫ్రికా)100 ఇన్నింగ్స్ లలో మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో భారత జట్టు హిట్ మాన్ రోహిత్ శర్మ(ఇండియా) 102 ఇన్నింగ్స్ లో, మూడవ స్థానంలో సచిన్ టెండూల్కర్ (ఇండియా) 111 ఇన్నింగ్స్ లలో , నాలుగో స్థానంలో తిలకరత్న దిల్షన్ (శ్రీ లంక) 121 ఇన్నింగ్స్ లలో, ఐదవ స్థానంలో సౌరవ్ గంగూలీ (ఇండియా) 123 ఇన్నింగ్స్ లలో ఉన్నారు. అయితే ఈ లిస్టు లోకి 'గబ్బర్' శిఖర్ తాజాగా మూడవ స్థానంలో చేరగా, టీం ఇండియాలో రెండవ స్థానాన్ని అధిగమించాడు.