డిస్టిబ్యూటర్స్ ని ఆదుకున్న నిర్మాత ?

SMTV Desk 2019-01-23 12:12:16  Ram Charan, Vinaya Vidheya Rama, Boyapati Srinu, kiara advani, DVV Danayya

హైదరాబాద్, జనవరి 23: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా వినయ విధేయ రామ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కాగా పండుగ సెలవుల కావడంతో 60 కోట్ల షేర్ మార్క్ ను చేరుకుంది. అయితే చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా నష్టాలనే మిగిల్చిందని టాక్. ఈ నేపథ్యంలో కొంత మేర అయిన నష్టాన్ని తగ్గించడానికి నిర్మాత డీవీవీ దానయ్య నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధపడ్డారు.

ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. దీంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టపోయారు, ఆ నష్టాన్ని కొంతవరకైనా తగ్గించాలని నిర్మాత దానయ్య రూ.50 లక్షల వరకూ వెనక్కి ఇచ్చేశాడని సమాచారం. కాగా మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో ఆయన వాళ్లతో చర్చలు జరుపుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.