158 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి భారత్....

SMTV Desk 2019-01-23 11:39:14  India VS Newzeland, Virat kohli, Kane willamson

నేపియర్, జనవరి 23: భారత్-న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్నర్ సాంటర్న్‌తో పాటు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్‌ను తీసుకున్నట్లు విలియన్స్ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్ పూర్తి అయ్యేసమయానికి న్యూజిలాండ్ జట్టు 157 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. కుల్ దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి రాణించగా, ఆట ఆరంభంలో మహమ్మద్ షపీ ప్రధాన ఆటగాళ్లను దెబ్బతీసేలా 3 కీలక వికెట్లు తీశాడు. చాహాల్ కు 2, జాదవ్ కు 1 వికెట్ లభించింది.

64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ కుల్ దీప్ బౌలింగ్ లో శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన తరువాత న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎంతోసేపు నిలదొక్కుకోలేదు. 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. మరికాసేపట్లో 158 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు మైదానంలోకి దిగనుంది.