'ఇస్మార్ట్ శంకర్' లేటెస్ట్ అప్ డేట్....

SMTV Desk 2019-01-22 21:11:11  Ismart shankar, Ram pothineni, Poori jagannath, Charmi

హైదరాబాద్, జనవరి 22: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ . ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానుంది అని చిత్ర నిర్మాతల్లో వొకరైన చార్మి తెలిపారు. అయితే పూరీకి, రామ్ కు సరైన హిట్ లేక గత రెండేళ్లుగా సతమతవుతున్నారు. రామ్ గత రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.

అయితే తన తరువాత మూవీ మాత్రం కొంచెం విభిన్నంగానే ప్లాన్ చేసాడు అని చెప్పొచ్చు. ఇక పూరీ విషయానికొస్తే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పూరీజగన్ కి కూడా టెంపర్ మూవీ తరువాత బాక్స్ఆఫీస్ దగ్గర తన సత్తా చూపలేకపోయాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంభినేషణ్ లో వస్తున్న ఈ సినిమా ఈ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.