బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పాల్

SMTV Desk 2019-01-22 17:42:29  KA Paul, Chandrababu, CP Anjani kumar, Police case on chandrababu, Social media

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను కలిసిన పాల్ తనకు రక్షణ కల్పించాలని, అలాగే తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేలా వీడియోలు క్రియేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు తనపై ఏపీ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు చెప్పుకొచ్చారు. తన సోదరుడి హత్య కేసులో క్లీన్ చిట్ ఇచ్చారని అయినా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.