బీజేపీ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జలీల్ ఖాన్..

SMTV Desk 2019-01-22 15:41:16  Chandrababu Teleconference, jaleel khan, shabana khatur, kanna lakshminarayana

అమరావతి, జనవరి 22: ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన కుమార్తె షబానా ఖాతూర్ తో కలిసి జలీల్ ఖాన్ ఈరోజు అమరావతిలో చంద్రబాబుతో సమావేశయం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు విజయవాడ వెస్ట్ సీటు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కన్నా గాడి పేరులోనే కన్నం ఉందనీ, ప్రజల సొమ్మును కాజేసి నీతులు చెబుతున్నాడని జలీల్ ఖాన్ విమర్శించారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేస్తానని అన్నారు. తమకి రెండు టికెట్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా తెదేపా కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానాని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తెను భారీ మెజారిటీతో గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.