ఈబీసీ త్వరలోనే అమలు చేస్తాం..

SMTV Desk 2019-01-22 10:47:46  ebc 10 percent reservations, Nitish Kumar, Bihar CM Nitish Kumar, Supreme court of India, General Category

పాట్నా, జనవరి 22: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయంపై అవసరమైన న్యాయ సలహా తీసుకుంటున్నామని, అతి త్వరలోనే దానిని అమలుకు చేయటానికి పూనుకుంటామని బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ వెల్లడించారు. అత్యంత వెనుకబడిన కులాల వారికి జాతీయ స్దాయిలో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

అయితే తమ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకమని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. బిహార్‌లో ఇటీవల జరిగిన మూక హత్యలను ప్రస్తావిస్తూ ఇవి శాంతి భద్రతల సమస్యకు సంబంధించినవి కావని, వీటిని నియంత్రించేందుకు సామాజిక చైతన్యం పెరిగేలా ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు.