ప్రియా వారియర్ సినిమా ఆడియో ఫంక్షన్ కి గెస్టుగా టాప్ హీరో..

SMTV Desk 2019-01-21 18:30:00  Priya prakash varrier, Lovers day movie, Allu Arjun, cheaf gest

హైదరాబాద్, జనవరి 21: వొరు ఆదార్ లవ్ అనే మలయాళ సినిమా మొదటి టీజర్ తోనే ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దీంతో మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. హిందీ భాషల నుంచి ఆమెకి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా వొరు ఆదార్ లవ్ చిత్రాన్ని లవర్స్ డే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ బుధవారం (23వ తేదీ) సాయంత్రం 6 గంటలకు జెఆర్సీ కన్వెన్షన్లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రావడం వలన, తమ ప్రాజెక్టుపై క్రేజ్ మరింత పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.