'సర్కార్' జోడి రీపీట్..

SMTV Desk 2019-01-21 15:58:11  vijay, Keerthi suresh, nayanatara, atli, sarkar movie, theri, mershal, adirindi

హైదరాబాద్, జనవరి 21: మహానటి సినిమా కీర్తి సురేష్ కి విజయంతో పాటు మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో తెలుగు .. తమిళ భాషల్లో ఆమె అగ్రకథానాయికల జాబితాలో చేరిపోయింది. ఇళయదళపతి విజయ్ తో కలిసి కీర్తి నటించిన సర్కార్ సినిమా పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఆమె విజయ్ సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేసింది. విజయ్ తన తదుపరి చిత్రాన్ని అట్లీ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తేరి .. మెర్సల్ వంటి భారీ విజయాల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతుంది.

ఈ ముగురు హీరోయిన్లు నటించనుండగా, వొక కథానాయికగా నయనతారను ఎంపిక చేశారు .. మరో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారని సమాచారం. ఇక మూడవ కథానాయికని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. క్రీడల నేపథ్యంలో జరిగే రాజకీయాలపై ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు.