ఆర్.కృష్ణయ్యకు చుక్కెదురు...

SMTV Desk 2019-01-21 15:54:01  R Krishnaiah, Congress, BC Leader, Supreme Court, BC Reservation

హైదరాబాద్, జనవరి 21: బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. ఈ మధ్య పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ఇటీవల కృష్ణయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పిటిషన్ ని సోమవారం పరిశీలించిన న్యాయస్థానం దానిని కొట్టివేసింది.

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 22శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌‌ను రద్దు చేయాలని ఆర్‌.కృష్ణయ్య పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదని, నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోలేం అంటూ స్పష్టం చేసింది.