భారీ హిట్ కొట్టిన దిల్ రాజు..

SMTV Desk 2019-01-21 12:54:28  Venkatesh, Varun tej, F2 Movie, collections, dil raju, fidha, geetha govindam

హైదరాబాద్, జనవరి 21: ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి తగిన సినిమాలను నిర్మిస్తూ వచ్చే దిల్ రాజు, అప్పుడప్పుడు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నారు. నిర్మాతగా దిల్ రాజు చాలా సక్సెస్ లను అందుకున్నారు. కాగా సంక్రాతి కానుకగా థియేటర్లకు వచ్చిన 'ఎఫ్ 2' ఆయనకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం చాలా తక్కువ సమయంలో 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దిల్ రాజు గత చిత్రం 'ఫిదా' నైజాంలో 18 కోట్ల వరకూ రాబట్టేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డు ని అధిగమించేలా ఉంది.

ఇప్పటికే 'ఎఫ్ 2' సినిమా నైజాంలో 15 కోట్లకి పైగా వసూలు చేసేసింది. తొందరలోనే ' ఫిదా ' రికార్డును ఎఫ్ 2 క్రాస్ చేసే అవకాశాలు వున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో 'గీత గోవిందం' వసూళ్లను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మొత్తానికి దిల్ రాజు ఈ ఏడాది ఆరంభంలోనే మరిచిపోలేని హిట్ కొట్టారని ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.