జగన్ పై హత్యయత్న కేసులో రాష్ట్ర సర్కార్ కు షాక్

SMTV Desk 2019-01-21 12:42:35  YSRCP, YS Jagan mohan reddy, NIA, TDP, State government, High court

అమరావతి, జనవరి 21: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యయత్న కేసు మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుని ఎన్ఐఎ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం వేసిన స్టేపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్ఐఏ విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 30లోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపోతే ఈ అంశం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారం నేపథ్యంలో ఈకేసును సుప్రీంకోర్టులో విచారించాలంటూ వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు కోరారు. ఈ కేసు విచారణకు సంబంధించి పూర్తి వివరాలను హైకోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఎన్ఐఏ అధికారులకు హైకోర్టు ఆదేశించింది.