ఆర్.ఆర్.ఆర్ రెండవ షెడ్యూల్ షురూ ..!!

SMTV Desk 2019-01-21 11:48:36  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie, RRR Movie 2nd shedule

హైదరాబాద్, జనవరి 21: జూ.ఎన్టీఆర్ .. రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ మల్టీ స్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్వాతంత్ర సమరం కాలంలో ఆంగ్లేయుల పరిపాలనా నేపథ్యంలో తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా చరణ్ .. బందిపోటుగా ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఆ తరువాత రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం సందర్భంగా బ్రేక్ తీసుకున్నారు.

ఇక ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ను ఈ రోజున మొదలుపెడుతున్నారు. ఈ షెడ్యూల్లో సినిమాలోని ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా, విలన్ గా ఎవరు నటించనున్నారు అనేది ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సినిమాలో కథానాయికలుగా... విలన్ గా ఎవరు నటిచనున్నారు అనేదానిపై అభిమానులు ఆత్రుతను కనబరుస్తున్నారు.