అవసరమైతే జగన్ మద్దతైనా తీసుకుంటా: పవన్ కళ్యాణ్

SMTV Desk 2017-07-30 18:30:48  Pawan kalyan, janasena, uddanam, Pawan kalyan at Vizag symposium, Pawan about uddanam, Pawan about Jagan

విశాఖ, జూలై 30: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖ కన్వెన్షన్ సెంటర్లో ఉద్దానం మూత్రపిండాల సమస్యలపై హార్వర్డ్ వైద్య బృందాన్ని కలుసుకున్నారు. సమావేశంలో ప్రసంగిస్తున్న ఆయన ప్రజానీకానికి సహాయపడుతున్నానని, తన పోరాటం మానవాళి కోసం చేస్తున్నానని ప్రభుత్వాల కోసం కాదని స్పష్టం చేశారు. ఈ సమస్యను రాజకీయం చేయాలని ఆయన కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతును కూడా ప్రజల కోసం తీసుకుంటానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.