కేసీఆర్ కు జగన్ లేఖ : జగన్ కు ఏపీ మంత్రుల లేఖలు

SMTV Desk 2019-01-20 17:42:56  YSRCP, KCR, TRS, YS Jagan mohan reddy, Jagan wrote a letter to kcr, AP Ministers, Kollu ravinder reddy

అమరావతి, జనవరి 20: ఆదివారం ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల విభజనప వేగవంతం చెయ్యాలంటూ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాయడాన్ని విమర్శించారు. విద్యాసంస్థల విభజనపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఉన్నత విద్యామండలి ఆస్తుల పంప‌కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టని అని ఆరోపించారు.

టీఆర్ఎస్‌తో అంటకాగుతూ ఏపీ యువతకు ద్రోహం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. విద్యాసంస్థల విభజనపై అన్యాయం చేసిన కేసీఆర్‌తో జగన్‌ అంటకాగడం దేనికి సంకేతమని నిలదీశారు. ఏపీ విద్యార్థులకు జగన్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.