లైన్ క్లియర్...బాహుబలి పెళ్లి డేట్ ఫిక్స్

SMTV Desk 2019-01-20 16:43:14  Prabhas, Tollywood rebel star, Krishnam raju, Prabhas marriage, Saaho

హైదరాబాద్, జనవరి 20: ప్రపంచ స్తాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ రెబల్ స్టార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎట్టకేలకు తన పెళ్లి విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రభాస్ పెళ్లి కోసం అటు తన ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. బాహుబలి తరువాత చేసుకుంటాడని అప్పట్లో వార్తలు వచ్చినా.. సాహో సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయి పెళ్లి సంగతి పక్కన పెట్టేశాడు ప్రభాస్. భీమవరం ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని రకరకాల వార్తలు వినిపించాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు స్పందించిన అతడి పెదనాన్న నటుడు కృష్ణంరాజు తాజాగా ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు.

కృష్ణంరాజు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తన ఫ్యామిలీ, సినిమాలు, రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. సాహో సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుంది అని కామెంట్స్ చేశారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడని అందరూ తనను అడుగుతూనే ఉన్నారని సాహో తరువాత ప్రభాస్ కి పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. కాని ఎవరితో అని మాత్రం ఇంకా చెప్పలేదు. సాహో సినిమా భారీ లెవెల్లో తీస్తున్నట్లు చెప్పిన ఆయన సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని అన్నారు.