బన్నీ ఫాలోయింగ్ మాములుగా లేదు కదా....

SMTV Desk 2019-01-20 16:28:52  Stylish star allu arjun, Allu arjun twitter account, 3M Followers

జనవరి 20: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తన వ్యక్తగత ట్విట్టర్ ఖాతాలో ఫోల్లోవర్స్ సంఖ్య 3 మిలియన్లు చేరింది. 2015లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన బన్నీకి అప్పటినుండి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. తాజాగా ఆయన ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు బన్నీ. ట్విట్టర్ లో నన్ను ఫాలో ఆతున్న మూడు మిలియన్ల మందికి ధన్యవాదాలు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఇది నా బలం కాదు.. మీ ఆశీర్వాదం ఉంది అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు బన్నీ.ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.