ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క

SMTV Desk 2019-01-20 13:19:13  Congress CLP Leader Bhatti vikramarka, Telangana state oppostion party leader, Madhira constituency MLA

హైదరాబాద్, జనవరి 20: మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమర్కను శనివారం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎల్పీ నేతగా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

భట్టి విక్రమార్కను స్పీకర్‌గా ప్రకటించిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఆయనను అభినందించారు. ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ వ్యవహరిస్తారని స్పీకర్‌ ప్రకటించారు. అంతకుముందు తెదేపాకు చెందిన సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.