టీడీపీ కండువా కప్పుకోనికి ముహూర్థం ఖారారు..???

SMTV Desk 2019-01-20 12:58:20  Adiseshigiri rao ghattamaneni, YSRCP, YS Jagan, TDP

అమరావతి, జనవరి 20: ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత ఆదిశేషగిరి రావు ఘట్టమనేని తన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల 7/8 తేదిల్లో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. సినీ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు. ఆదిశేషగిరిరావు తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీకి ఇటీవలనే ఆదిశేషగిరిరావు రాజీనామా చేశారు.

ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరనున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి7 లేదా 8 తేదీల్లో టీడీపీలో చేరనున్నారని సమాచారం. సినీ నటుడు కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణ అభిమాన సంఘాలతో ఆదిశేషగిరి రావు చర్చించిన తర్వాత ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు.