కంటతడి పెట్టుకున్న వెంకీ..

SMTV Desk 2019-01-19 18:32:28  Venkatesh, Varun tej, F2 Movie, success meet, venkatesh crying

హైదరాబాద్, జనవరి 19: విక్టరీ వెంకటేశ్ .. వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమా సంక్రాతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాలలో తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. తొలివారంలోనే భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరోలు వెంకీ, వరుణ్ .. హీరోయిన్లు తమన్నా, మెహరీన్ ... దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వెంకటేశ్ మాట్లాడుతూ .." పదేళ్ల తరువాత నా సినిమాను థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూశాను. థియేటర్స్ లో ఆడియన్స్ స్పందన చూసి ఎంతో ఆనందపడ్డాను. చాలా కాలం తరువాత ఆడియన్స్ నుంచి ఈ స్థాయి రియాక్షన్ చూశాను. ఈ సినిమా చూస్తూ వాళ్లంతా నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు. వాళ్లంతా అలా నవ్వుతుండటం చూసి, ఆనందంలో నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. నా కెరియర్లో చాలా సంక్రాంతి సినిమాలు చూశాను. కానీ ఎఫ్ 2 వంటి హిలేరియస్ మూవీ మాత్రం రాలేదు" అని అన్నారు.