కేసీఆర్ తో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...

SMTV Desk 2019-01-19 15:39:15  Telangana Congress MLA s meet KCR, TRS Party, Malugu constituency MLA Seethakka, Pinapaka constituency MLA Rega kantharao, Asifabad constituency MLA Athram sakku, Bhadhrachalam constituency MLA Podem veeraiah

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నలుగురు నూతన ఎమ్మెల్యేలు కలిశారు. తమ నియోజకవర్గాల్లో ఆదివాసుల సమస్యలతో పాటు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కొంత సమయం పాటు ముఖ్యమంత్రితో చర్చించారు. కేసీఆర్ తో సమావేశమైన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యలున్నారు. ఈ ఆదివాసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆదివాసి ప్రాంతాల్లోని పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరారు. అందుకు సంబంధించి వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి అందిజేశారు.

ఈ సమస్య పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు కేసీఆర్ ఎమ్మెల్యేలకు సీఎం హామీ ఇచ్చారు. అతి త్వరలో ఆదివాసులు ఎక్కువగా వున్న నియోజకవర్గాలను
స్వయంగా తానే సందర్శిస్తానని అక్కడిక్కడే పోడు భూముల సమస్యతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించనునున్నట్లు సీఎం తెలిపారు. అంతకు ముందే వచ్చే నెలలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తానని అన్నారు. అందుకు అనుగుణంగా ఆదివాసి ప్రజల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.