మా మూడు గిఫ్ట్ లు కేసీఆర్ దిమ్మ తిరిగేలా ఉంటాయి

SMTV Desk 2019-01-19 13:41:37  KCR, Chandrababu, Varla ramaiah, KCR Return gift to Chandrababu

అమరావతి, జనవరి 19: ఏపీ సీఎం కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ పై చంద్రబాబు స్పందిస్తూ నీ గిఫ్ట్ కు బదులుగా నేను నీకు మూడు గిఫ్ట్ లు ఇస్తానని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘మా మూడు గిఫ్ట్ లు కేసీఆర్ దిమ్మ తిరిగేలా ఉంటాయి. కొంచెం ఓపిక పట్టండి. కేసీఆర్ తలకు పట్టిందంతా వదిలిపోతుంది అని వ్యాఖ్యానించారు.





సీఎం చంద్రబాబుని, టీడీపీని విమర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుతున్న భాష సరిగా లేదని, బూతులు మాట్లాడుతున్న ఆయన, ‘ఇది తెలంగాణ భాష అని సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఉపయోగిస్తున్న పదజాలం ఏమాత్రం పద్ధతిగా లేదని తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు.