ఫేస్‌బుక్‌ కి షాక్ ఇవ్వనున్న FTC ??

SMTV Desk 2019-01-19 12:14:00  Facebook,Social media,FTC,dataleak,Fine,Databreeche,Zuckerberg

సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో షాక్‌ తగిలింది ఇన్ని రోజులు డేటా బ్రీచ్‌ ఆరోపణలతో ఇబ‍్బందుల్లో పడిన ఫేస్‌బుక్‌ మరోసారి ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే

భారీగా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా విక్రయించిందన్న అంశాలపై విచారణ చేస్తున్న సంస్థ ఫేస్‌బుక్‌కు అత్యధిక జరిమాన విధించే దిశగా కదులుతోంది. గోప్యతా ఉల్లంఘనలకు సంబంధించి ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించేందుకు రంగం సిద్ధమవుతోందని మనకి తెలుస్తోంది. చాలాసార్లు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున వినియోగదారుల డేటా బ్రీచ్‌ ఆరోపణల నేపథ్యంలో ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (FTC) రికార్డు స్థాయిలో జరిమానా విధించాలని భావిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ అందించిన కధనం ప్రకారం, ఫేస్‌బుక్‌పై సుమారు 16వేల కోట్ల రూపాయల (22.5మిలియన్‌డాలర్ల)కు మించి పెనాల్టీ విధించేందుకు FTC యోచిస్తున్నట్లు తెలుస్తున్నది . 2012 లో గోప్యతా ఉల్లంఘనలకు గాను గూగుల్‌పై FTC విధించిన అత‍్యధిక జరిమానా 22.5 మిలియన్ల డాలర్లు. అలాగే ఫేస్‌బుక్‌కు పెనాల్టీ సెగతాకనుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్టు చేసింది.
కాగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.7కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను ఫేస్‌బుక్ విక్రయిస్తోందనే ఆరోపణలు ప్రకంపనలు రేపాయి . మరోవైపు ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని వొప్పుకున్న ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందు హజరుకావడం, భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా చూస్తామని హమీ ఇవ్వడం జరిగింది. అంతేకాకా జూకర్ బర్గ్ పత్రికా ప్రకటనల ద్వారా కూడా క్షమాపణలు కోరారు. అయితే ఈ నివేదికలపై ఎఫ్‌టీసీ, ఫేస్‌బుక్‌ ఇంకా వ్యాఖ్యానించలేదు.