సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

SMTV Desk 2019-01-19 11:22:18  CLP Post, Congress party, Rahul gandhi, Telangana legislative assembly, Bhatti vikramarka

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) పదవి కోసం ఎన్నో రోజులుగా ఎంతో మంది నేతలు ఎదురుచూస్తున్నఈ పదవికి శుక్రవారం రాత్రి తెరపడింది. సీఎల్పీ లీడర్ గా మల్లుభట్టి విక్రమార్కను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.

నిన్న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, సీఎల్పీ రేసులో సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ ఈ పదవి దళిత వర్గానికి చెందిన భట్టికే దక్కింది. 2009లో, 2014లో భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మధిర నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు.