ఎన్టీఆర్ వైద్యసేవ పరిమితి పెంపు

SMTV Desk 2019-01-18 20:50:42  NTR, Chandrababu, NTR Trust

గుంటూర్, జనవరి 18: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, తెదేపా అధినేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూర్ జిల్లాలోని సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్నిరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. తరువాత ఆయన మాట్లాడుతు ఎన్టీఆర్‌ వొక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నామని అన్నారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ సాగర్‌లో సభాపతి కోడెల శివప్రసాద్‌రావుతో కలిసి బోటులో విహరించారు.