కోల్‌కతాకు పయనమైన ఏపీ సీఎం

SMTV Desk 2019-01-18 20:34:53  AP CM, Chandrababu, Mamata benarjee, BJP, TDP

అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు సాయంత్రం కోల్ కత్తాకు వెళ్ళినట్లు సమాచారం. శనివారం ఉదయం 9గంటల నుండి 12 గంటల వరకు కోల్‌కతాలోని తాజ్‌ బెంగాల్‌ హోటల్‌లో పలు జాతీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతారు. జాతీయ రాజకీయాలు, బిజెపియేతర పక్షాల ఐక్యత వంటి విషయలపై చర్చలు జరపనున్నారు.

తరువాత మమతాబెనర్జీ నిర్వహించనున్న ర్యాలీలో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబుతోపాటు మంత్రులు యనమల రామకృష్ణడు, కళా వెంకట్రావ్‌, పలువురు నేతలు వెళ్లారు. ర్యాలీకి హాజరుకావాల్సిందిగా ఈరోజు ఉదయం మమతాబెనర్జీ చంద్రబాబుకు ఫోన్‌ చేశారు.