తెలంగాణ కార్మికులకు శుభవార్త

SMTV Desk 2019-01-18 20:30:18  Telangana labour department, State government, Labours child get scholarships

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర కార్మికులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు ధార్మిక, ఇతర ట్రస్టులల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు, కార్మికులకు ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించినట్లు మండలి ఇన్‌ ఛార్జి సంక్షేమ కమిషనర్‌ పి శ్రీనివాస్‌ తెలిపారు.

ఇందుకోసం ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తులను కార్మిక శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 10వ తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణులైన వారికి రూ.1000, పాలిటెక్నిక్ రూ.1500, ఇంజనీ రింగ్, మెడిసిన్, లా,బీస్సీ(అగ్రికల్చర్),మెడికల్ లెబోరేటరీ టెక్నిషియన్, పీజీ డిప్లమా, ఇన్ మెడికల్ లేబోరేటరీ టెక్నీషియన్ పూర్తి చేసిన వారికి రూ.2000 అందిస్తామని తెలిపారు.