మేయర్ పోస్ట్ భర్తీకి కేటీఆర్ ప్రయత్నాలు

SMTV Desk 2019-01-18 17:58:02  TRS Party working president, KTR, Warangal Meyer post, TRS, KCR

వరంగల్, జనవరి 18: తెరాస పార్టీకి కంచుకోట అయినటువంటి వరంగల్ లో మేయర్ పోస్ట్ కాలిగా ఉండడంతో అక్కడి ప్రాంత పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. అయితే ఆ పోస్టును భర్తీ చేయడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. తాజాగా వరంగల్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ అసెంబ్లీ భవనంలోని టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా మేయర్ నన్నపనేని నరేందర్ పోటీకి దిగి గెలపొందారు. దీంతో వరంగల్ మేయర్ పదవి ఖాళీ అవ్వడం వల్ల కొత్త మేయర్ ఎంపిక అనివార్యమయ్యింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెలరోజులు కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ముందుగా వరంగల్ మేయర్ ను నియమించాలని నిర్ణయించింది.

ఇందుకోసం సీఎం కెసిఆర్ ఆదేశాలతో కేటీఆర్ గురువారం కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పరేషన్ పరిధి‌లోని ఐదుగురు ఎమ్మెల్యేలు ,శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర రెడ్డిలతో అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కెటిఆర్ ప్రాథమిక చర్చలు జరిపారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయభాస్కర్, వర్దన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌లతో కేటీఆర్ స్వయంగా భేటీ అయ్యారు. అలాగే స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి‌లతో ఈ సమావేశం నుంచే కెటిఆర్ ఫోన్లో మాట్లాడారు. ఇలా ప్రస్తుతం స్థానిక శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న కేటీఆర్ మరింత మంది అభిప్రాయాలు తీసుకుని పార్టీ అధ్యక్షులు, సీఎం కెసిఆర్‌కు నివేదించన్నారు. దీని తర్వాత మేయర్ అభ్యర్థిపై తుది నిర్ణయం కేసీఆర్ తీసుకుని ప్రకటించనున్నట్లు తీసుకుంటామని కేటీఆర్ వెల్లడించారు