సాహో'కి ఆ పాట హైలైట్..

SMTV Desk 2019-01-18 17:54:59  Prabas, Saho, New movie, item song

హైదరాబాద్, జనవరి 18: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలోని వొక ఐటమ్ సాంగ్ ను కూడా భారీగా చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ లో పాప్ స్టార్ బెయాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఈ పాటకి ప్రముఖ డాన్స్ మాస్టర్ వైభవి మర్చంట్ కొరియోగ్రఫీని అందించనున్నట్టు చెబుతున్నారు.

అలాంటి ఈ పాట ప్రత్యేకంగా నిలవడం కోసం భారీ సెట్ వేసి .. అనేక ఆకర్షణీయమైన హంగులను సమకూర్చుతున్నారని అంటున్నారు. ప్రభాస్ .. బెయాన్స్ కలిసి వేసే స్టెప్పులు ఆయన అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.